మోసగాళ్లు సినిమా తో నిండా మునిగిన మంచు విష్ణు...!!

మంచు వారి పెద్దబ్బాయి హీరోగా ఇటీవలే వచ్చిన చిత్రం మోసగాళ్లు.. కాజల్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటించింది.. స్కాం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమయ్యింది.. దాంతో సినిమా విష్ణు కి మరో ఫ్లాప్ అందించింది.  టాలీవుడ్ లో మంచు విష్ణు కి కొత్త అదృష్టం, ఎక్కువగా దురదృష్టం వెంటాడుతుంది.. ఎందుకంటే అయన సినిమాల్లో పదిలో ఒక్కటి హిట్ అవుతున్నాయి.. మిగితా తొమ్మిది ఫ్లాప్ అవుతున్నాయి.. మంచు విష్ణు కి చివరి హిట్ ఏంటో ఎవరికీ గుర్తు అయితే లేదు.

కానీ ఫ్లాప్ మాత్రం మోసగాళ్లు అని వెంటనే చెప్పొచ్చు.. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఈ సినిమా మిగిల్చిన లాస్ కూడా భారీగానే ఉందట.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా దారుణమైన నిరాశని మిగిల్చింది.. తన కం బ్యాక్ మూవీ గా విష్ణు పలు ఇంటర్వ్యూ లలో చెప్పగా ఆ సినిమా కనీసం ఒక్క రోజు కూడా ఆడలేక పోయింది.. ముందునుంచి ఈ సినిమా ని ప్రేక్షకులు అస్సలు యాక్సప్ట్ చేయలేదు. ముందు కాజల్ హీరో కి అక్క అనగానే ప్రేక్షకులకు ఎందుకో మింగుడు పడలేదు.. దాంతో సగం సినిమా అక్కడే పోయింది.. నిజానికి ఇది మంచు లక్ష్మి, విష్ణు చేయాల్సిన సినిమా.. వాళ్ళు ఉంటేనన్నా సినిమా బాగా అదేదేమో అంటున్నారు.

ఇకపోతే  ఈ మోసగాళ్ళు  సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. మోసగాళ్ళు 20 కోట్ల ప్లస్ బిజినెస్ చేయగా.. 21 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగింది. అంటే 21 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఇప్పటికి వరకు ఇటు తెలంగాణ అటు ఏపీ కలుపుకుని 0.81CR షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ మొత్తంగా 0.99 CR షేర్ వసూలు చేయగా.. టోటల్ గ్రాస్ 1.90 CR వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకోవడంతో.. మొత్తంగా 20 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అంటున్నారు సినీ పండితులు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.