

తమన్నా భాటియాకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో అందరికి తెలిసిందే. హ్యాపీడేస్ సినిమా నుంచి ఇప్పటిదాకా ఆ ఫాలోయింగ్ పెరుగుతానే ఉంది. ఇప్పుడు తమన్నా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. తమన్నా ప్రధాన పాత్రలో గుంటూరు టాకీస్, గరుడ వేగా సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ను రూపొందుతోంది. త్వరలోనే టాలివుడ్ ఓ.టి.టి ఆహాలో ప్రసారం కానున్న ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్కు సంబంధించిన టైటిల్ను, పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. అల్లు అరవింద్, తమన్నా, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, రైటర్-ప్రొడ్యూసర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్నా తన దుస్తులతో దేవకన్య లాగా కనిపించింది. చాలా రోజుల తరువాత తమన్నా మళ్ళీ సినీ కార్యక్రమంలో కనిపించి తన అందంతో తళుక్కుమని మెరిసింది. ఆమె ధరించిన నీలం రంగు గౌన్ ని సాఫ్రోన్ బౌటిక్ వాళ్ళు డిజైన్ చేశారు. తమన్నాని అందంగా తన స్టైలిస్ట్ సకృతి తయారు చేశారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.