
ఇటీవలే భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న మెహ్రీన్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఆమె అభిమానులను ఖుషి చేసింది. నాలుగు నెలలక్రితం మెహ్రీన్ భవ్య తో ఎంగేజిమెంట్ కాగా కారణం అయితే తెలియదు కానీ ఆమె ఆయనతో జరిగిన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఇకపై తన పూర్తి దృష్టిని సినిమాలపైనే సారిస్తానని చెప్పింది.

ప్రస్తుతం ఆమె 'ఎఫ్ 3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. తన ఫేవరెట్ 'ఎఫ్ 3' ఫ్యామిలోకి తిరిగొచ్చానని ఆ ఫొటో కు క్యాప్షన్ పెట్టింది. తన నిశ్చితార్థం రద్దయిన తరుణంలో సినిమా సెట్స్ లో ఆమె సంతోషంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

'ఎఫ్ 2' చిత్రం 2019లో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తదితరులు నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'ఎఫ్ 3' నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.