
టాలీవుడ్ బొద్దుగుమ్మ మెహ్రీన్ కి ఈ మధ్యే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. సినిమాలు చేస్తున్న టైములో, ఆఫర్ లు వస్తున్న టైం లో ఆమె ఈ డెసిషన్ తీసుకోవడం ఆమె ఫ్యాన్స్ ని ఎంతగానో కలవరపరుస్తోంది.. అయితే ఇప్పుడు చేసేదేం లేక ఆమె పెళ్లి చాలాబాగా జరగాలని కోరుకుంటున్నారు.. నిజానికి మెహ్రీన్ కెరీర్ ఏమంత బాగాలేదని చెప్పాలి. టాలీవుడ్ లో అయితే ఆమె డూ ఆర్ డై పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు.. F2 లాంటి సూపర్ హిట్ వచ్చిన ఆమెకు ఆ హిట్ తాలూకు క్రెడిట్ ఏ మాత్రం దక్కలేదు.. మల్టీ స్టారర్ చిత్రం కావడంతో అందులోనూ ఇద్దరు హీరోయిన్ లు రావడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు..

అయితే ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ ఆ తర్వాత రెండో సినిమాకి కొంత గ్యాప్ తీసుకుంది.. అయితే ఈ గ్యాప్ లో ఏమైంది ఏమో గానే ఆమె బరువు పెరిగి కొంత వేరియేషన్ ని చూపించింది.. దాంతో ప్రేక్షకులు మెహ్రీన్ ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత ఆమె బరువు తగ్గి F2 సినిమాలో చేశారు.. ఆ సినిమా హిట్ అయ్యింది.. తనకు ఆఫర్స్ వచ్చినా రాకున్నా సినిమాలో మెహ్రీన్ అందచందాలకు ఏమాత్రం కొదువలేదు..

బక్కపలచని ఫిగర్ కాకుండా తెలుగు వారు మెచ్చే విధంగా ఎంతో బొద్దుగా ఉండడంతో ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం F3 సినిమా చేస్తున్న మెహ్రీన్ కి భవ్య బిష్ణోయ్ తో ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. అయితే భవ్య తనకు ప్రపోజ్ చేసిన విధానం నచ్చిందని ఆ ఎక్స్ పీరియన్స్ ని చెప్పింది మెహ్రీన్.. పుట్టినరోజు కి అండమాన్ కి వెళ్లిన నన్ను సముద్రం నీటిలోకి తీసుకెళ్లాడు. అండర్ వాటర్ లో ఒక మోకాలిపై నిల్చొని నాకు ప్రపోజ్ చేశాడు. అదంతా ఓ మేజిక్ లా జరిగిపోయింది." అంటూ తన మోస్ట్ లవ్లీ మూమెంట్ ని చెప్పింది మెహ్రీన్..