
పెర్ఫార్మెన్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కష్టతరమైన పాత్రల్ని సైతం అవలీలగా చేసి అందరి చేత భళా అనిపించుకున్న గొప్ప నటుడు చిరంజీవి గారు. ఇక నటన పరంగా అయన స్థానాన్ని బర్తీ చేసేది ఎవరు అనే ప్రశ్నకు ఏకైక సమాధానం ఎన్టీఆర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైన అవలీలగా చేసే నటుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే నటుడు ఎన్టీఆర్. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా, డ్యాన్స్ పరంగా తనకు తానే సాటి అనిపించుకునే ఆయన వరస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్నారు. చిరంజీవి గారు సైతం ఆ విషయాన్ని ఎన్నో వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే.


ఎన్టీఆర్ సైతం నటనలో ఆయన్ను చూసి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాని బాహాటంగానే చెప్పారు. ఇక ప్రస్తుతం కరోన సోకినా ఎన్టీఆర్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోమని ఆయన సూచించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ వేదికగా తెలియజేసారు.
కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2021
God bless @tarak9999
“కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తారక్, అతని కుటుంబ సభ్యులు కూడా బానే ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషించాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను”. అని ఆయన ట్వీట్ చేసారు. ఇక అయన త్వరగా కోలుకుని ఆ మహమ్మారి భారి నుండి బయట పడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన సన్నిహితులు కూడా ఎప్పటికప్పుడు ఆయన యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు.