భారీ సెట్‌లో ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర ‘భోళా శంకర్’ షూటింగ్!!

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా  నిర్వహించారు.  

సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు.




అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

భోళా శంకర్ వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్ :  మెహర్ రమేష్
నిర్మాత  : రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :  కిషోర్ గరికిపాటి
డీఓపీ  : డడ్లీ
సంగీతం :  మహతి స్వర సాగర్
ఎడిటర్  : మార్తాండ్ కే వెంకటేష్
స్క్రిప్ట్ పర్యవేక్షణ  : సత్యానంద్
ఫైట్స్ :  రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా
కొరియోగ్రఫర్ :  శేఖర్ మాస్టర్
లిరిక్స్ :  రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ
వీఎఫ్ఎక్స్ :  యుగంధర్
పబ్లిసిటీ డిజైన్  : అనిల్ భాను
పీఆర్వో :  వంశీ శేఖర్
డిజిటల్ మీడియా హెడ్ : విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్ : మెహర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ కంట్రోలర్ : అజయ్ కుమార్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్ :  లలిత్ ప్రభాకర్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ : రామకృష్ణ రెడ్డి, రవి దుర్గా ప్రసాద్

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.