
అందాల తార అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ షో ఈ మధ్యనే మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న సమంత ఇప్పుడు హోస్ట్ గా కూడా ఆకర్షిస్తుంది. నవంబర్ 13న ఈ షో ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ అతిధిగా వచ్చారు. ఈ మొదటి ఎపిసోడ్ తోనే సమంత అందరినీ అలరించి మెప్పించింది. అయితే ఇప్పుడు సామ్‌జామ్ షోలో కొత్త ఎపిసోడ్‌కి ఎకంగా మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో బాస్ ఈజ్ బాక్ అని కాప్షన్ తో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అన్ని సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి. సూట్ వేసుకొని ఈ ఫొటోస్ లో చిరంజీవి గారు చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయి త్వరలోనే ఇది ఆహా స్ట్రీమింగ్ సర్వీస్ లో విడుదల కాబోతుంది. ఈ ఎపిసోడ్ ఆహాలో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.
Boss is back with #SamJam! 🔥@Samanthaprabhu2 @KChiruTweets
— ahavideoIN (@ahavideoIN) November 19, 2020
📷 : @ArtistryBuzz pic.twitter.com/GtGRT0VXTu