
యువ కథానాయకుడు శర్వానంద్ కి ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది. అలాగే స్నేహితులు కూడా ఉన్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వా ఇద్దరూ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. కెరీర్ పరంగా శర్వాకి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు చరణ్. ఇటీవలే తన బర్త్ డే కి కూడా సర్ప్రైజ్ గా కేక్ కాట్ చేయించాడు. శర్వాకి కూడా చరణ్ అంటే చాల అభిమానం. చిరంజీవి గారిని విపరీతంగా అభిమానించే శర్వా అంటే చిరుకి కూడా చాల ఇష్టం.

ఆయన సినిమాల్లో కూడా శర్వా కొన్ని ముఖ్య పాత్రలు పోషించారు. వివరాల్లోకి వెళ్తే ఆయన నటించిన శ్రీకారం చిత్రం మార్చ్ 11న విడుదల కానుంది. దేనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖమ్మంలో నిర్వహించనున్నారు. దానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ విషయమై ఆయన్ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ వేడుకకు హాజరయ్యారు. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకుడు.

గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియంకా ఆరుళ్ మోహన్ నాయికగా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయి కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఖమ్మంతో పాటు 9న హైదరాబాద్ లో మరో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ హాజరవనున్నారు. వ్యవసాయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.