'మాస్ మంత్ర' బాలయ్య బాబు అభిమానుల మనసు నుంచి వచ్చిన పాట: 'మాస్ మంత్ర' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బి గోపాల్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి!!

‘’మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అభిమానుల్లో జగన్ నాకు దగ్గరగా వుంటారు. బాలయ్య అంటే జగన్ కి పిచ్చి. ఈ బర్త్ డే కి అద్భుతమైన సాంగ్ చేశాడు. ఈ పాట అద్భుతంగా వుంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అభిమానుల మనసులో నుంచి వచ్చిన పాటిది’’ అన్నారు ప్రముఖ దర్శకులు బి గోపాల్.

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్ డే(జూన్ 10) సందర్భంగా రూపొందించిన 'మాస్ మంత్ర' స్పెషల్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనంతరపురం జగన్ సమర్పణలో రూపొందిన ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బి గోపాల్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, సాహు గారపాటి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బి గోపాల్ మాట్లాడుతూ.. గ్రేట్ హీరో బాలయ్య బాబుకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే. రామారావు గారు అంటే నాకు చాలా అభిమానం. అలానే బాలయ్య బాబు అంటే అంత అభిమానం, ఇష్టం. బాలయ్య బాబుతో నేను చేసిన మొదటి సినిమా లారీ డ్రైవర్. అందులో బాలయ్య ..బాలయ్య.. అనే లిరిక్ తో పాట వుండాలని ముందే నిర్ణయించుకున్నాను. బాలయ్య అంటే అంత ఇష్టం. ఏ పాత్ర వేసిన బాలయ్య అద్భుతంగా వుంటారు. మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అభిమానుల్లో జగన్ నాకు దగ్గరగా వుంటారు. బాలయ్య అంటే జగన్ కి పిచ్చి. ఈ బర్త్ డే కి అద్భుతమైన సాంగ్ చేశాడు. ఈ పాట అద్భుతంగా వుంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అనిల్ రావిపూడి బాలయ్య బాబు తో భగవంత్ కేసరి చేస్తున్నాడు. టైటిల్ అద్భుతంగా వుంది. బాలయ్య బాబు లుక్ ఎక్స్ టార్డినరిగా వుంది. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.  

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. బాలయ్య బాబు తో వీరసింహా రెడ్డి సినిమా చేసే అదృష్టం దక్కింది. బాలయ్య బాబు మనసు బంగారం. చాలా మంచి మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. బాలయ్య బాబుకి నేను ఒక అభిమానిని. బాలయ్య బాబుకి వున్న కల్ట్ ఫ్యాన్స్ లో అనంతపురం జగన్ ఒకరు.  వీరసింహా రెడ్డి షూటింగ్ లో ఎంతగానో సహకరించారు. ఫ్యాన్స్ అందరూ బాలయ్య బాబుని ఎలా ఇష్టపడతారో, అలా వాళ్ళ మనసు నుంచి వచ్చిన పాట ఇది. పాటలో బాలయ్య గారి వ్యక్తిత్వం కనిపిస్తోంది. బాలయ్య బాబు అంటే రాజసం, బాలయ్య బాబు అంటే పూనకం. ఈ పాట జనాల్లోకి బాగా వెళుతుంది. అనిల్ బాలయ్య బాబుకి పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా వుంటుందో ఆ వైబ్రేషన్ జూన్ 10న  భగవంత్ కేసరి తో చూస్తారు. బాలయ్య బాబుకి అడ్వాన్స్ బర్త్ డే విషెష్. జై బాలయ్య’’ అన్నారు

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..  ఒక అభిమానికి సినిమా నచ్చితే వందసార్లయిన చూస్తారు. అందుకే తెలుగు సినిమాలో అభిమానికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంటుంది. అలాంటి అభిమానులు అందరి హీరోలకుకి వున్నారు. బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఆ మ్యాడ్ నెస్ ఇంకా ఎక్కువ వుంటుంది. అలాంటి అభిమానుల మధ్య ఆయనకి పుట్టిన రోజు కానుకగా  అనంతరపురం జగన్ గారు అభిమానులందరి తరపున ఓ మంచి పాటని డెడికేట్ చేయడం ఎంతో ఆనందంగా వుంది.  ఎన్ బి కే హెల్పింగ్ హాండ్స్ ద్వారా జగన్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  ఈ సాంగ్ కి పని చేసిన టీం అందరికీ నా బెస్ట్ విశేష్. పాట చాలా బావుంది. లిరిక్స్, విజువల్స్.. బాలకృష్ణ గారికి యాప్ట్ అనిపించింది.  భగవంత్ కేసరి పోస్టర్ కు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ గారితో ఏడాది గా ప్రయాణిస్తున్నాను. ఆయన్ని దగ్గరగా చూస్తే ఎన్నో గొప్ప క్యాలిటీలు కనిపిస్తాయి. ఆయన అంటే ముందు అభిమానం వుండేది. భగవంత్ కేసరి కోసం పని చేస్తున్నపుడు ఆయన అంటే వందరెట్ల గౌరవం పెరిగింది. దర్శకుడికి ఈ ఆయన ఇచ్చే గౌరవం, మర్యాద గొప్పగా వుంటుంది.  పాత కొత్త చిన్న పెద్ద అనే తేడా లేకుండా తోటి నటీనటులందరికి ఎంతో కంఫర్ట్ ఇస్తారు. భగవంత్ కేసరి జర్నీ నా లైఫ్ లో చాలా స్పెషల్. ఈ సినిమా విడుదలయ్యాక ప్రతి అభిమానికి జర్నీ అఫ్ భగవంత్ కేసరి గుర్తుండిపోతుంది. భగవంత్ కేసరి టీజర్.. జూన్ 10, పది గంటల19 నిమిషాలకు బద్దలైపోతుంది. ఇది బాలయ్య బాబు పెట్టిన ముహూర్తం’’ అన్నారు

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..  నేను ఎన్ని సినిమాలు చేసినా ఆదిత్య 369 నిర్మాతగానే గుర్తుపెట్టుకుంటారు. అంత గొప్ప సినిమాని ఇచ్చారు బాలయ్య గారు. బాలకృష్ణ గారితో పరిచయ భాగ్యం వుండటమే నా అదృష్టం. బాలకృష్ణ గారిది కల్మషం లేని హృదయం. ఆయనతో మళ్ళీ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను. జై బాలయ్య'' అన్నారు.  

సాహు గారపాటి మాట్లాడుతూ.. అనంతరపురం జగన్ గారు చేసిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వున్న బాలకృష్ణ గారి అభిమానులకు రీచ్ అయి పెద్ద సక్సెస్ కాబోతుంది. అలాగే మేము నిర్మిస్తున్న భగవంత్ కేసరి టైటిల్ పోస్టర్ మీ అందరి అంచనాలని అందుకుందని భావిస్తున్నాను. బర్త్ డే కి రాబోయే టీజర్ కూడా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతునాను'' అన్నారు.  

అనంతరపురం జగన్ మాట్లాడుతూ.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన వారసత్వాన్ని ,ఆశయాల్ని కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి కానుకగా ఈ పాట చేశాం. ఈ వేడుకకు బాలకృష్ణ గారితో  అద్భుతమైన చిత్రాలు తీసిన బి గోపాల్, గోపీచంద్ మలినేని, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అలాగే ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ తీసుకున్న అనిల్ రావిపూడి లాంటి ఆత్మీయులు రావడం ఆనందంగా వుంది. ‘భగవంత్ కేసరి’ తో  అనిల్ ఈ దసరాకి సంచలనం సృష్టిస్తాడు. మన అభిమానం ఎదుటివారికి ఉపయోగపడాలని ఎన్ బి కే హెల్పింగ్ హాండ్స్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నాం. నా జీవితం బాలయ్య బాబుకి అంకితం. ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని గౌరవించడం నా భాద్యత.’’ అన్నారు.

మాస్ మంత్ర పాటకు ఈశ్వర్ దత్ మ్యూజిక్ అందించారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించగా కరిముల్లా, చైతు, సబిహ కలసి ఆలపించారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.