మాస్ బిర్యానీ వడ్డించిన క్రాక్

రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రం 'క్రాక్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రమోషన్స్ భాగంగా ట్రైలర్ ని సైతం రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. సినిమాలో వయోలెన్స్ ఎక్కువగానే ఉండటంతో ‘ఏ’ కూడా ఇచ్చారు. అలాగే జనవరి 9న ఈ సినిమా విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి మాస్ బిర్యాని పాట ను విడుదల చేశారు. ఈ పాటకి వీపరీతమైన క్రేజ్ వచ్చింది. బలుపు తర్వాత థమన్, గోపిచంద్ మలినేని, రవితేజ, శ్రుతిహాసన్ కలయికలో వస్తుండటం విశేషం. ఈ పాట లో శ్రుతి హాసన్, రవితేజ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. థమన్ మ్యూజిక్ ఉర్రుతలు ఊగించింది.  లిరిక్స్ కాసర్ల శ్యామ్ అందించగా రాహుల్ నంబియర్, సాహితి చాగంటి పాడారు. ఈ సినిమాకి బి మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.