మంచు మనోజ్ పాన్ ఇండియా సినిమా ఆగిపోయిందా..!!

మంచు ఫ్యామిలీ నుంచి హీరో గా వచ్చిన మంచు మనోజ్ పుట్టిన రోజు నేడు.. అయన మంచి సినిమాలతో వచ్చి టాలీవుడ్ లో ముందు ముందు పెద్ద హీరోగా ఎదగాలని సోషల్ మీడియా లో ఆయనకు బర్త్ డే విషెష్ చెప్తున్నారు అభిమానులు.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా లో నటిస్తున్న మంచు మనోజ్ గత కొన్ని రోజులుగా ఆ సినిమా గురించి ఎలాంటి వార్తలు వదలట్లేదు. ఎలాంటి అప్ డేట్స్ ని ఇవ్వట్లేదు.. దాంతో ఆ సినిమా అస్సలు ఉందా లేదా అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు అభిమానులు..

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. వచ్చి రాగానే అయన అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమా ను తెరకెక్కిస్తున్నాడని తెలపగానే అయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డారు ప్రేక్షకులు.. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా కి సంబందించిన ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా కి ఏమైంది అన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.. మరి ఈరోజు అయన పుట్టిన రోజు ఈ రోజైనా ఆ సినిమా గురించి ఏదైనా చెప్తారా అనేది చూడాలి..

ఇకపోతే టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ కి బ్యాడ్ లక్ వెంటాడుతుంది అని చెప్పాలి... ఆ ఫ్యామిలీ  నుంచి టాలీవుడ్ కి వచ్చిన వారిలో మోహన్ బాబు తప్పా ఎవరు నిలదొక్కుకోలేకపోతున్నారు. వరుస హిట్లు దక్కకపోవడం, వచ్చిన హిట్ ను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు వారసులు నార్మల్ హీరోలుగా నే మిగిలిపోయారు..  మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు.. విష్ణు పర్వాలేదనిపించుకున్నా మంచి లక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.