
తెలుగు, తమిళ్, మలయాళం లో ఎన్నో మంచి చిత్రాలలో నటించారు మమతా మోహన్ దాస్. 2005లో మలయాళంలో ‘మయూఖం’ అనే సినిమాతో నటిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. తెలుగులో మొట్టమొదటి సారిగా ‘యమదొంగ’ సినిమాలో ధన లక్ష్మి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. తరవాత కింగ్, కేడి వంటి సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించారు. ఆమె మంచి గాయని కూడా తెలుగులో రాఖీ, శంకర్ దాదా
జిందాబాద్, జగడం, యమదొంగ వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె “మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయం గురించి మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ – “నిర్మాణం లోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కల నిజం అవుతున్నట్టుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత
ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన వల్లనే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను” అన్నారు. తొలి ప్రయత్నంగా ఒక లేడి ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నామని తెలిపారు.