
సోమవారం మాదాపూర్ లోని హెచ్ ఐ సిసి లో హై లైఫ్ వస్త్రాభరణాల ప్రదర్శన కు విచ్చేశారు సినీ హీరోయిన్ లు కృతి శెట్టి, మాళవిక శర్మ.. టాలీవుడ్ కి రవితేజ నేలటికెట్టు సినిమా తో పరిచయమై తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. తొలి సినిమా విజయం సాధించడంతో ఆమెకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. అందం, అభినయం తో ఆకట్టుకున్న మాళవిక ఆ తర్వాత చేసిన రెడ్ సినిమా తో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది.. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను ఉంచుతూ ప్రేక్షకులను అలరించే ఈమె తన లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంది.

ముంబై లో పుట్టి పెరిగి తెలుగు సినిమాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.. ఆ సినిమాలు హిట్ అయితే ఆమె త్వరలో స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అంటున్నారు. ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక సెలబ్రిటీ అన్నాకా, ముఖ్యంగా హీరోయిన్ అన్నాకా షాప్ ఓపెనింగ్ వంటి ఈవెంట్స్ కి వెళ్లడం సహజం.. అలా మాళవిక శర్మ, కృతి శెట్టి ల కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హై లైఫ్ వస్త్రాభరణాల ప్రదర్శన కు ఆహ్వానం రాగా వారు సోమవారం సందడి చేశారు.

ఈ ప్రదర్శనకు వీరి అభిమానులు చాలామంది విచ్చేయగా ఆమెతో పాటు పలువురు మోడల్స్ కూడా ఈ ప్రదర్శనకు విచ్చేశారు. వారి రాకతో ఈ షో ఎంతో అందంగా తయారైంది అన్న కామెంట్లు వెలువడుతున్నాయి.