
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాలీవుడ్ కథానాయిక ఆలియాభట్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఈ రోజు విడుదల చేశారు చిత్ర బృందం.

ఇప్పటికే రెండు టీజర్ లతో సినిమాపై భారీ అంచనాలను పెంచిన రాజమౌళి ఈ మేకింగ్ వీడియో తో ఆ అంచనాలను రెట్టింపు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా మా మే కింగ్ వీడియోను చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం విడుదల చేయగా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను అందుకుంది.

ఇందులోని షాట్స్ మేకింగ్ చూస్తుంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సినిమా చూస్తున్న సమయంలో ఒళ్లు గగుర్పుట్టడం పుట్టడం ఖాయం గా కనిపిస్తుంది. ఈ సినిమాల్లో నటులు కూడా నటిస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతా రామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ కనిపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వీరి టీజర్ లు భారీ స్పందన దక్కించుకున్నాయి. అక్టోబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.