మేజర్ దాదాపు అయిపోయినట్లే..!!

అడివి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్కా 'మేజర్' సినిమాను రూపొందిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా నుంచి వదిలిన ప్రచార చిత్రాలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తీయడానికి అనుమతి కోరినప్పుడు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు అంగీకరించలేదట. ఆ పాత్ర గౌరవాన్ని కాపాడతానని అడివి శేష్ హామీ ఇచ్చాకే ఒప్పుకున్నారట.ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాతలలో మహేశ్ బాబు ఒకరుగా ఉండటం విశేషం.

తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన కరోనా పరంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకంతో అడివి శేష్ ఉన్నాడు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.