
క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి విజయవంత చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు, మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పి విమల నిర్మిస్తున్నారు.
రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం డిజెగా వైబ్రెంట్ అవతార్‌లో పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో రోషన్ గిరజాల జుట్టు, సన్ గ్లాసెస్‌తో, DJ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించారు. ఈ పోస్టర్ చాలా ట్రెండీగా వుంది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, నవీన్ యాదవ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. రవికాంత్ పేరేపు తో పాటు, విష్ణు కొండూరు, సెరి-గన్ని రచయితలు. వంశీ కృష్ణ స్క్రీన్ ప్లే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. శివమ్‌రావు ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తునారు.
తారాగణం: రోషన్ కనకాల
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
రచన: రవికాంత్ పేరేపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
నిర్మాత: పి విమల
బ్యానర్: మహేశ్వరి మూవీస్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డీవోపీ : నవీన్ యాదవ్
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
పబ్లిసిటీ డిజైన్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్