
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరోయిన్ కృతి సనన్. కానీ ఆ తర్వాత తెలుగు తెరపై పెద్దగా కనపడటం లేదు. కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జతకడుతున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలను ఇటీవలే నిర్మాణ సంస్థ ఖండించింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుందని తెలుస్తోంది. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ ఈ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.