మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేతుల మీదుగా`మా ఊరి పొలిమేర‌`-2 పోస్ట‌ర్ లాంచ్ !!

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై  గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `మా ఊరి పొలిమేర -2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.  స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్ష‌త‌, బాలాదిత్య‌, సాహితి దాస‌రి,   ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను  ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే  షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది.  ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్ట‌ర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.
న‌టుడు స‌త్యం రాజేశ్ మాట్లాడుతూ...`` గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `మా ఊరి పొలిమేర ` చిత్రాన్ని ఎంతో ఆద‌రించారు. దానికి  సీక్వెల్‌గా వ‌స్తున్న `మా ఊరి పొలిమేర -2` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నికూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం.  ద‌ర్శ‌కుడు సీక్వెల్ ని అద్భుతంగా తెర‌కెక్కించారు.  నిర్మాత గౌరికృష్ణ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు`` అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ ``మా ఊరి పొలిమేర -2` చిత్రం ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేసిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారికి  హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. `మా ఊరి పొలిమేర `చిత్రాన్ని  చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. దానికి  సీక్వెల్‌గా వ‌స్తున్న `మా ఊరి పొలిమేర -2` చిత్రం మా బ్యాన‌ర్‌లో చేస్తున్నందుకు  ద‌ర్శ‌కుడు డా. అనిల్ విశ్వ‌నాథ్ గారికి, మ‌రియు  న‌టీ న‌టులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. అంద‌రం ఒక  ఫ్యామిలీ లాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాము. ద‌ర్శకుడు `మా ఊరి పొలిమేర`ను మించి ఈ  చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ కూడా రిలీజ్ చేస్తాము`` అన్నారు.
ద‌ర్శ‌కుడు డా. అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. `మా ఊరి పొలిమేర -2` ఫ‌స్ట్‌లుక్ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారు విడుద‌ల చేయ‌డం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా.  `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్ష‌కులంద‌రూ బాగా ఆద‌రించారు.  `మా ఊరి పొలిమేర`  చిత్రానికి సిక్వెల్ ఉందా.. లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రం విడుద‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత గౌరికృష్ణ వెల్ల‌డిస్తారు` అని అన్నారు.
డీఓపీ ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి మాట్లాడుతూ.. `మా ఊరి పొలిమెర ` చిత్రాన్ని ఓటీటీలో చూసి అమైజింగ్ గా ఫీల్ అయ్యాను. ల‌క్కీగా `మా ఊరి పొలిమెర -2` చిత్రానికి డీఓపీ కావ‌డం చాలా సంతోషంగా ఉంది. స్టోరి నాకు చాలా బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్ అనిల్ గారు నాకు ఫుల్ స‌పోర్ట్ ఇచ్చారు. అందుకు మా డైరెక్ట‌ర్ గారికి ధ‌న్య‌వాదాలు. `మా ఊరి పొలిమెర -2` ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ హై లెవెల్‌లో ఉంటాయి. మా నిర్మాత గౌరికృష్ణ ఎక్క‌డా కూడా ఖ‌ర్చుకు కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకు వారికి నా ధ‌న్య‌వాదాలు. స‌త్యం రాజేష్ గారితో ప‌ని చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌తో మీ ముందుకు వ‌స్తాము` అని అన్నారు.

   ఈ చిత్రానికి సంగీతంః గ్యాని;  సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వ‌ర‌;  కో-డైర‌క్ట‌ర్ః ఆకుల నాగ్‌; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.సి.స‌తీష్ కుమార్;   నిర్మాతః గౌరి కృష్ణ‌;  స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.