
భానుమతి రామకృష్ణ, ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆహా ఓ.టి.టి లోకి మరో కొత్త సినిమా రాబోతోంది. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘మా వింత గాధ వినుమా’. ఈ చిత్రం నవంబర్ 13న దీపావళి సందర్బంగా ఆహలో విడుదల కానుంది. కరోనా కారణంగా వాయిదా పడిన చిత్రాలన్నీ ఇప్పుడిప్పుడే మొదలై త్వరత్వరగా షూటింగ్స్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సినిమాలో సిద్దూకి జోడిగా సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సిద్దు, సీరత్ ఈ మధ్య విడుదల అయిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాలో నాయికానాయకులుగా అలరించారు. ‘మా వింత గాధ వినుమా’ సినిమాకి సిద్ధు కో రైటర్ గా కూడా పనిచేయడం ఇంకో విశేషం. లాక్ డౌన్ సమయంలో కూడా ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని ఆహా లో విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఫస్ట్ లుక్ విడుదల చేసి అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తొంది. ఈ సినిమాలో కల్పిక, తనికెళ్ళ భరణి, కమల్ కమరాజు, ప్రగతి ప్రధాన పాత్రలు పోషించారు. భానుమతి రామకృష్ణ, కలర్ ఫోటో లాంటి సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆహాలో మంచి విజయం సాధిస్తుందో లేదో చూడాలి అంటే దీపావళి వరకు ఆగాల్సిందే.