మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేతతో మంచి మార్కులు కొట్టేసాడు. ఏ హీరో అయిన మాస్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే కళ్యాణ్ దేవ్ మాత్రం ఒక ఫామిలీ సినిమాలో నటించి అందరి ప్రశంసలు పొందారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘సూపర్ మచ్చి’. కొత్త దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇక ఈ సినిమా నుంచి చూసానే చూసానే అనే పాట లిరికల్ వీడియోని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా ఈ రోజు విడుదల చేసారు. ఈ పాట వినడానికి చాలా బాగుంది. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలై శర వేగంగా నడుస్తుంది. కన్నడ సినిమాల్లో ఫేమస్ హీరోయిన్ రచిత రామ్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతుంది. ఇక షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో మూవీ టీం మెల్లగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి మూవీ టీం ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాలనే ఒక ఫామిలీ ఎంటర్టైనర్.