ఆగస్టు లోనే లవ్ స్టోరీ.. చైతు క్లారిటీ.!!

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. సున్నితమైన భావోద్వేగాలతో ఆయన ప్రేమకథలు కొనసాగుతాయి. అందుకే యూత్ లో ఆయన సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసివుంది. అయితే మిగతా సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా వాయిదా వేసుకుంది.

ఏప్రిల్ నుంచి మే నెలకి వాయిదా పడిన ఈ సినిమా, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అలా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉండటంతో, ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. సాయిపల్లవిపై చిత్రీకరించిన 'సారంగధరియా ..' పాట ఇప్పటికే పాప్యులర్ అయింది .. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.