ఈ సలాం వేరే..!

విభిన్నమైన కథాంశంతో కూడుకున్న కొత్తరకం ప్రయత్నాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్‌ బాగుంటే అది సినిమా అయినా వెబ్‌సిరీస్‌ అయినా ఆదరణలో ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైవిధ్యమైన కథాంశంలతో పలు వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఓ చక్కటి కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ‘లోల్‌సలామ్‌’ పేరుతో జీ-5ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో

ఓ వెబ్‌సీరిస్‌ రాబోతుంది. ఆరు ఏపిసోడ్స్‌లతో పూ ర్తివినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్‌సీరిస్‌ జీ-5 ఓటీటీలో ఈ నెల 25న విడుదల కాబోతుంది. కాగా ఈ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేసి తన శుభాకాంక్షలు అందజేశాడు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. లాక్ డౌన్ లో ఈ వెబ్ సిరీస్ అన్దరిఏ వినోదాన్ని పంచనుంది.

లైఫ్ బోర్ కొట్టి వున్న టెన్షన్స్ ను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో ఒకరు అనుకోకుండా ఆ  అడవిలో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వా ళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అనేది పూ ర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచారు, 40 కొత్త ఆర్టిస్టులతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్‌సీరిస్‌కు మ్యూజిక్‌: అజయ్‌ అరసాడ, సినిమాటోగ్రఫీ: రాకేష్‌ ఎస్‌ నారాయణ, ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల, కథ-మాటలు: అర్జున్‌-కార్తీక్‌.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.