జీవితంలోని బంధాలు, బంధుత్వాల గురించి చెబుతూ ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందిన సినిమా ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) - నిర్మాత‌ సాక్షి ధోని

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్త‌గారితో క‌లిసి ఉండ‌లేన‌ని, వేరు కాపురం పెడ‌తామ‌ని పెళ్లికి ముందే ఆ కాబోయే వ‌రుడితో అంటే.. త‌న‌కు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతాన‌ని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు త‌ల్లి.. మ‌రో వైపు కాబోయే భార్య మ‌ధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది ప‌డ్డాడ‌నే క‌థాంశంతో రూపొందిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married). ఇండియ‌న్ లెజెండ్రీ క్రికెట‌ర్ ఎం.ఎస్‌.ధోని  ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ విడుద‌ల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. నిర్మాత  సాక్షి ధోని, హీరో హరీస్ క‌ళ్యాణ్‌, హీరోయిన్ ఇవానా, న‌దియా, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ త్రిపుర ప‌సుపులేటి త‌దిత‌రులు పాల్గొన్నారు. నిట్రో స్టార్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా...

త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ త్రిపుర ప‌సుపులేటి మాట్లాడుతూ ``చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్ట‌టం ఇదే తొలిసారి. మా ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్`` అన్నారు.

ఆర్‌.జె.విజ‌య్ మాట్లాడుతూ ``ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగ‌మైనందుకు చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్ నుంచి ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు వ‌స్తున్నాయి. వాటిని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతో మందికి ఈ ఇండ‌స్ట్రీ లైఫ్ ఇచ్చింది. నాకు తెలుగు తెలియ‌క‌పోయినా.. నేను చెన్నైలో చాలా సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్పాను. అలా కాలేజ్ డేస్‌లోనే నాకు తెలుగు ప‌రిశ్ర‌మ ఎంతో హెల్ప్ చేసింది. ఆగ‌స్ట్ 4న మూవీ రిలీజ్ అవుతుంది. అంద‌రూ సినిమాను ఎంజాయ్ చేయండి`` అన్నారు.

న‌దియా మాట్లాడుతూ ``చాలా రోజుల త‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చాను. ధోని ఎంట‌ర్‌టైన్మెంట్స్‌లో  పార్ట్ కావ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌ను మీరెలా ఎంజాయ్ చేశారో.. అలాగే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను. మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. ధోని, సాక్షిగారికి ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమాభిమానాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను`` అన్నారు.

హీరోయిన్ ఇవానా మాట్లాడుతూ ``‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) మాకెంతో స్పెష‌ల్ మూవీ. ధోనిగారి ప్రొడ‌క్ష‌న్‌లో తొలి సినిమాగా వ‌స్తున్న ఇందులో మేం పార్ట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలోనే మ‌ర‌చిపోలేని అనుభ‌వం. సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేసి చేశాం. ఆగ‌స్ట్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఫీల్ గుడ్‌ సినిమాను త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.

హీరో హ‌రీష్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ``తెలుగు సినిమాల‌కు, తెలుగు ఆడియెన్స్‌కు నేను పెద్ద అభిమానిని. ఎందుకంటే మీరు సినిమాను పండుగ‌లా సెల‌బ్రేట్ చేస్తారు. తెలుగు స్టార్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంది. కొత్త సినిమాల‌ను పెద్ద పెద్ద స్టార్స్ ఇక్క‌డ ఎంక‌రేజ్ చేస్తున్న తీరు గొప్ప‌గా ఉంది. జెర్సీ సినిమాలో చిన్న రోల్‌లో మిమ్మ‌ల్ని మెప్పించాను. ఇప్పుడు ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) తో మీ ముందుకు రాబోతున్నాను. చాలా ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. ధోనిగారికి, సాక్షిగారికి, ఇవానా, విజ‌య్ స‌హా అంద‌రికీ థాంక్స్. ఆగ‌స్ట్ 4న ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) మూవీ థియేట‌ర్స్‌లోకి వ‌స్తుంది`` అన్నారు.

నిట్రో స్టార్ సుధీర్ బాబు మాట్లాడుతూ `` ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. క్రికెట్ ప్రపంచంలో ధోనిగారు ఓ లెజెండ్‌. ఆయ‌నొక సొంత బ్యాన‌ర్ స్టార్ట్ చేసి సినిమా చేయ‌టం చూసి థ్రిల్ అయ్యాను. క్రికెట్‌లో ఆయ‌నెలాంటి విజ‌యాల‌ను సాధించారో అలాంటి స‌క్సెస్‌ను సినిమా రంగంలోనూ సాధించాల‌ని కోరుకుంటున్నాను. సాక్షిగారికి ఆల్ ది బెస్ట్‌. జెర్సీలో మంచి రోల్‌తో మెప్పించిన హ‌రీష్ క‌ళ్యాణ్ ఈసారి ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married)తో మ‌న ముందుకు వ‌స్తున్నారు. ల‌వ్ టుడేతో మ‌న‌కు ద‌గ్గ‌రైన ఇవానా ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. హృద‌యం సినిమాకు వ‌ర్క్ చేసిన విశ్వ‌జీత్ విజువ‌ల్స్ గొప్ప‌గా ఉన్నాయి. ర‌మేష్ త‌మిళ్ మ‌ణి డైరెక్ట‌ర్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా గొప్ప వ‌ర్క్ చేశారు. న‌దియాగారికి, యోగిబాబుగారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమానుతెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న త్రిపుర ప‌సుపులేటి,  డా.ప‌వ‌న్‌గారు అభినంద‌న‌లు`` అన్నారు.

సాక్షి ధోని మాట్లాడుతూ `` సాధార‌ణంగా మావారు ధోని.. ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో స‌ర్ప్రైజ్ ఇది. సాధార‌ణంగా క్రికెట్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్. కానీ, మా వారికి అది ప్రొఫెష‌న్‌. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంట‌ర్‌టైన్మెంట్ కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. ఇద్ద‌రం చాలా సినిమాలు చూస్తాం. అది థియేట‌ర్‌లో కావ‌చ్చు. ఓటీటీలో కావ‌చ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వ‌చ్చాం. ఇంకా మ‌రెన్నో సినిమాల‌ను చేయ‌టానికి సిద్ధంగా ఉన్నాం. ‘ఎల్‌జీఎం’ సినిమాను త‌మిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. అందువ‌ల్ల తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాల‌ను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్ని. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాల‌న్నింటినీ చూశాను. నేను త‌న‌కు పెద్ద అభిమానిని. నేను స్టోరీ డిస్క‌ష‌న్‌లో డైరెక్ట‌ర్‌తో మాట్లాడేదాన్ని. ఎక్కువ‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్క‌స్ చేసుకునేవాళ్లం. అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నాను. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి క‌థ‌. సాధార‌ణంగా మ‌న రిలేష‌న్స్‌లో పొర‌ప‌చ్చాలు వ‌స్తుంటాయి. వాటిని తిరిగి నిల‌బెట్టుకుటూ వెళుతుంటాం. మ‌న లైఫ్‌లో రిలేష‌న్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌న మ‌న‌సులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌నే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెర‌కెక్కించాం. ఆగ‌స్ట్ 4ప మూవీ రిలీజ్ అవుతుంది`` అన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.