
అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్,
తేజ అయినంపూడి, ప్రియ
ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మిస్టేక్". ఏఎస్పీ మీడియా హౌస్
సంస్థ తమ ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సన్నీ
కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
మిస్టేక్ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
లాంఛ్ చేశారు. మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న రకుల్...సినిమా
టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
సమీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ - హరి జాస్తి, సంగీతం - మణి జెన్న, డైలాగ్స్ - శ్రీ హర్ష
మండ, ఆర్ట్ - రవి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిధి, నిర్మాత -
అభినవ్ సర్ధార్, దర్శకత్వం - సన్నీ కోమలపాటి.