
టాలివుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంపై మొదటి నుండి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ ప్లాపుల్లో ఉండడంతో ‘క్రాక్’ చిత్రం విజయవంతం కావడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో వచ్చిన రూమర్ ఏంటంటే క్రాక్ చిత్ర రషెస్ చూసిన రవితేజ ఈ చిత్ర ఔట్పుట్ పట్ల నమ్మకంతో లేడట. అందుకే కొన్ని సీన్లను రీషూట్ కు ఆదేశించాడని రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే క్రాక్ టీమ్ చాలా తెలివిగా ఈ రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండానే వాటికి అడ్డుకట్ట వేసింది. తమ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయిందని, ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దాన్ని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయబోతున్నట్లు తెలిపింది. మరోసారి తమ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది అన్న క్లారిటీ ఇచ్చింది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందింది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా టాగుర్ మధు నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే.
#krack Sankranthi 2021 release pic.twitter.com/uM05TLCDCN
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2020