
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్, పూజ హెగ్డే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలకు ఇంకా నెలా 15 రోజుల టైమ్ మాత్రమె ఉండటంతో వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు.
ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు, అలాగే రామ్ చరణ్ కి సంబంధించిన పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసారు. లాహే లాహే అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ ని అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి కలిసి ఆలపించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.