నయనతార, విజ్ఞేష్ శివన్ కలిసి నిర్మిస్తున్న 'కూజన్గల్'

విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన నానుమ్ రౌడి దన్ తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాని విజ్ఞేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నయనతార  విజ్ఞేష్ శివన్ మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరు కలిసి సినిమాలని రౌడి పిక్చర్స్ కంపెనీ పేరుతో నిర్మిస్తున్నారు. ఇక వీరి ఇద్దరి నిర్మాణంలో ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది. కూజన్గల్ పేరుతో వస్తున్న ఈ సినిమాని తమ సంస్థ నుంచి నిర్మిస్తున్నట్టు విజ్ఞేష్ శివన్ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసారు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలని వెతికి తనని నిర్మించేలా చేస్తున్న నయనతార కి విజ్ఞేష్ తన పోస్ట్ లో ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. అయితే ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడమే కాకుండా ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా తీసుకొనివెళ్తున్నాం అని ఆయన ప్రకటించారు. కూజన్గల్ సినిమాని వినోథ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు అని ప్రెస్ నోట్ లో విజ్ఞేష్ అన్నారు. కూజన్గల్ అంటే గులకరాళ్లు అని తెలుగు అర్థం. ఇప్పటికే నయనతార హీరోయిన్ గా చేస్తున్న నేట్రికన్ సినిమాతో పాటు విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతారలతో కొత్త సినిమాని కూడా రౌడి పిక్చర్స్ నిర్మిస్తుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.