

ఉప్పెన సినిమా చూసిన ఎవరికైనా హీరోయిన్ క్రితి శెట్టి తెగ నచేస్తుంది.తన అందం , నటనతో మొదటి సినిమాతోనే క్రితి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఉప్పెన ప్రి రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు క్రితి గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయిని ముందే హీరోయిన్ గా బుక్ చేసుకోండి తర్వాత దొరకదు అని ఎలా అన్నారో కానీ నిజంగానే ఉప్పెన సినిమా విడుదల తర్వాత క్రితి ఎవరికి దొరకట్లేదు.
వరసగా తెలుగులో సినిమాలని ఒప్పుకుంటు క్రితి టాలీవుడ్ లో కొత్త ఉప్పెన అయింది. ఆమె మొదటి సినిమా విడుదల కాకముందే ఒప్పుకున్న నాని సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో క్రితి తో పాటు సాయి పల్లవి కూడా నటిస్తుంది.
ఇక ఈ మద్యనే ఆమె ఇంకొక సినిమా కూడా ఒప్పుకుంది. మంచి కూల్ సినిమాలని తెసే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారి డైరెక్షన్ లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో తెలంగాణ అమ్మాయిలా క్రితి కనిపించబోతుంది. ఈ సినిమాలో క్రితి కి జోడిగా సుధీర్ బాబు నటిస్తున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహణం , వి సినిమాలు వచ్చాయి. ఇక ముచ్చటగా మూడో సినిమాగా ఒక మంచి లవ్ స్టొరీతో ఈ కాంబినేషన్ రాబోతుంది. ఇలా క్రితి వరస క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో దూసుకెళ్తుంది.