ఎప్పుడూ లేని కన్ఫ్యూజన్ లో కొరటాల..?

ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూసేది రెండు విషయాల కోసం ఒకటి ఆయన కరోన నుంచి కోలుకునేది ఎప్పుడు అని, ఇంకోటి ఆయన పుట్టిన రోజు. ఎందుకంటే తారక్ తదుపరి సినిమాల విషయం గురించిన అప్డేట్స్ వచ్చేది అప్పుడే కాబట్టి. అయితే ఆయన సినిమాల విషయంలో అధికారిక ప్రకటన వచ్చే దాకా కొంత గందరగోళం ఉండే మాట వాస్తవమే. ఈ పుట్టినరోజుకి ఆయన నుంచి ఏదోక అప్డేట్ అయితే తప్పక వస్తుంది. అది ఆర్.ఆర్.ఆర్ మూవీ నుంచి కావొచ్చు, కొరటాల సినిమా నుంచి కావొచ్చు లేదా తదుపరి సినిమా అనౌన్స్మెంట్ కావొచ్చు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సినిమా పూర్తయితే కాని తదుపరి సినిమా మొదలవదు. ఆర్.ఆర్.ఆర్ ఆక్టోబర్ 13న వస్తుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోన కారణంగా సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. రిలీజ్ కి ఇంకా టైం ఉన్నా షూటింగ్ టైం కి పూర్తైతేనే కదా రిలీజ్ కరెక్ట్ టైం కి చేసేది. ఇదిలా ఉంటే కొరటాలతో చేస్తున్న సినిమా కూడా 2022 ఏప్రిల్ లో విడుదల అవుతుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అసలు సినిమానే స్టార్ట్ అవ్వలేదంటే ఆల్లు రిలీజ్ దాకా వెళ్ళిపోయారు. ఇక సినిమా విషయానికి వస్తే బౌండ్ స్క్రిప్ట్ ను ఈ మధ్యే పూర్తి చేసిన శివ అందులో ఒక ముఖ్యమైన పాత్రకు ఎవరిని తీసుకోవాలని తెగ హైరానా పడుతున్నారట.

ఓ పాత్రకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని అనుకుని ఆవిడను ఒప్పించే పనిలో ఉన్నారని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయి. ఆ పాత్రతో పాటుగా కథానాయకుడికి సమానమైన మరో పాత్ర ఉందట అందుకోసం ఆయన ఎవర్ని తీసుకోవాలో అర్థం కాకా తికమక పడుతున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం కొరటాల బిగ్ బి అమితాబ్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఈ సినిమాలో ఈ సారి తారక్ తో నటన విషయంలో పోటి పడేది మోహన్ లాల్, అమితాబ్ లలో ఎవరూ అనేది వేచి చూడాలి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.