కలెక్షన్స్ కురిపిస్తున్న కర్ణన్.. మరి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయలేదు?

తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తారు. ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి పేరును తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలానే తమిళ హీరోల్లో చాలా మంది ఇక్కడ పాపులర్ అయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, ధనుష్, విజయ్ సేతుపతి, విశాల్, కార్తి లాంటి హీరోలకు ఇక్కడ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమా వచ్చిందంటే మన హీరోలతో సమానంగా వాళ్ళ సినిమాలకి వెళ్తుంటారు. రీసెంట్ గా విడుదలైన కార్తి సుల్తాన్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి

తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న నటుడు ధనుష్. రఘువరన్ బి.టెక్, మారి, కొలవెరి 3 లాంటి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ధనుష్, తన నటనతో తెలుగులో కూడా పాగా వేసాడు. ఇటీవల ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తంధిరం సినిమా కూడా జగమే తంత్రం పేరుతో డబ్ అయ్యి ఓ.టి.టిలో విడుదల అయ్యేందుకు సిద్ధమయింది. ఈ చిత్రం ముందుగా వస్తుంది అనుకుంటే అనూహ్యంగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన కర్ణన్ సినిమా థియేటర్లలో విడుదలైంది.

పెరియెరుమ్ పెరుమాళ్ లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రంపై చాలా అంచానాలు ఉన్నాయి. ఆ అంచనాలను దాటుకుంటూ ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. అలాగే విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. ఈ చిత్రానికి IMDB లో 9.2 రేటింగ్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉందో. అంతా బానే ఉన్నా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయలేదు. డబ్బింగ్ ప్రాబ్లమ్ అనుకున్న కనీసం డైరెక్ట్ గా తమిళ్ లో అయినా రిలీజ్ చేయలేదు. దీని పై ఇక్కడి ధనుష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.