
ప్రముఖ తమిళ నటుడు వివేక్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూసారు. హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన్ను చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఆయన వియోగానికి పలువురు సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్త పరుస్తున్నారు.
Really Shocking....
— karthik subbaraj (@karthiksubbaraj) April 17, 2021
Rest in Peace Vivek Sir 🙏🏼 pic.twitter.com/cWBrVDWvp8
అపరిచితుడు, శివాజీ, సింగం లాంటి సినిమాలతో ఆయన తెలుగు తెరకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా రజినీకాంత్, సూర్య లాంటి వారితో ఆయన చేసిన కామెడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. తమిళ హాస్యనటులలో వివేక్ అగ్ర గణ్యుడు. 1987లో మనధిలి ఉరుత్తి వేఁడుం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన కేలడి కన్మణి, నన్బర్గల్ తదితర సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో ఇలాంటి స్ట్రైట్ చిత్రం చేయకపోయినా డబ్బింగ్ చిత్రాలతోనే ఇక్కడ కూడా మంచి పాపులారిటి దక్కించుకున్నారు.

సుమారు 230 చిత్రాల్లో ఆయన నటించారు. కేవలం కామెడి రోల్సే కాక డిఫెరెంట్ గా ట్రై చేయి అని కమల్ హాసన్, బాలా గార్ల సలహా మేరకు ‘నాన్ దాన్ బాలా’ అనే సినిమాలో సీరియస్ రోల్ చేసి అందరినీ మెప్పించారు. ఒక వైపు కామెడి రోల్స్ చేస్తూనే మరో పక్క సీరియస్ రోల్స్ చేసారు. కళారంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాంటి గొప్ప నటుడ్ని కోల్పోవడం చాలా బాధాకరం. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.