
దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్..కన్నడ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..

కేజిఎఫ్ సినిమా వచ్చేంత కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి.

కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘సలార్’ షూటింగ్ చేస్తూనే దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. అవి చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుందని అంటున్నారు. కాగా ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువే అన్నది చిత్ర వర్గాల సమాచారం. 2 గంటల 52 నిమిషాల రన్ టైంతో ‘కేజీఎఫ్-2’ను విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడట.