A Huge Jail set erected for High voltage action sequence in Hyd for stylish Action film #Khiladi #Kgf stunt masters #AnbAriv composing this fight💥 @RaviTeja_offl @DirRameshVarma @DimpleHayathi @Meenachau6 @ThisIsDSP #AStudiosLLP #KoneruSatyanarayana @idhavish @PenMovies pic.twitter.com/GWNXw1SMNR
— BARaju (@baraju_SuperHit) December 23, 2020
మాస్ మహారాజ రవితేజ వరస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే క్రాక్ సినిమా షూటింగ్ ను ముగించుకున్న రవితేజ ఇప్పుడు తన తర్వాతి చిత్రం ఖిలాడీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఫుల్ స్పీడ్ లో ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తవ్వగా తర్వాతి షెడ్యూల్ కు సంబంధించిన కీలక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జైలు సెట్ ను నిర్మించారు చిత్ర టీమ్. ఒక కీలకమైన యాక్షన్ ఘట్టంతో పాటు కొన్ని సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. ఇక ఈ షెడ్యూల్ కు సంబంధించి మరో విశేషం ఏమిటంటే ఫైట్ మాస్టర్లుగా కేజిఎఫ్ చిత్రంతో నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్న అన్బు-అఱివు ద్వయం ఖిలాడీ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఖిలాడీకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.