
గత కొన్ని సినిమాలుగా అక్కినేని నాగార్జున ఫ్లాప్ లతో సతమవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సారి రెగ్యులర్ సినిమాలను కాకుండా టెర్రరిజం బ్యాక్ గ్రౌండ్ లో వైల్డ్ డాగ్ సినిమా ని ఎంచుకుని ఓ ప్రయత్నం చేశారు.. అయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఇటీవలే రిలీజ్ మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డ చిత్ర టీం కి ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఆనందమేస్తుంది..
దీనికి ముందు నాగార్జున నటించిన చిత్రం మన్మధుడు 2 దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్న నాగార్జున మరో సినిమా చేయడానికి ఇన్నోరోజులు పట్టింది.. కొన్ని సంవత్సరాలుగా నాగార్జున కెరీర్ కూడా పెద్దగా బాలేదు. రాజు గారి గది2 సినిమా పర్వాలేదనిపించుకున్నా ఆఫీసర్, దేవదాస్ సినిమాలు నాగ్ కెరీర్ లో మచ్చలుగా మిగిలిపోయాయి..
ప్రస్తుతం 'బంగార్రాజు' సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. దాంతో మొత్తానికి ఈ పాజెక్టు సెట్ అయిందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమాలో బంగార్రాజు అవునంటే కాదంటూ ఆయనతో కయ్యానికి కాలుదువ్వే విలన్ పాత్రలో 'సముద్రఖని' కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.