
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వచిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి 'రాజావిక్రమార్క' టైటిల్ ఖరారు చేశారు. అలాగే, సినిమాలో హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Unveiling the first look of Karthikeya's #RajaVikramarka
— Sandeep Reddy Vanga (@imvangasandeep) June 20, 2021
I wish all the very best to the entire cast and crew :-) Good luck guys 🤝@ActorKartikeya @SriSaripalli_ @actortanya @88Ramareddy #AdireddyT @prashanthvihari @SCMMOffl @PulagamOfficial pic.twitter.com/VlntFIHf9t
“ఎన్.ఐ.ఎ లో కొత్తగా జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. యాక్షన్ సన్నివేశాలను స్పెషల్ గా డిజైన్ చేశాం. అవి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్ను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ఆర్. విహారి మంచి బాణీలు అందించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని దర్శకుడు అన్నారు.

తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు యువ నటుడు కార్తికేయ. ఆయన చేసిన చిత్రాలు వేటికవే ప్రత్యేకమైనవి. సినిమా సినిమాకి మెక్ ఓవర్ అవుతూ కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత్ర నచ్చితే విలన్ గా చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు మన కార్తికేయ. గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆయన చేసిన విలన్ పాత్రే అందుకు ఉదాహరణ. ఆ చిత్రంలో స్టైలిష్ విలన్ గా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక ఎన్.ఐ.ఎ చిత్రంతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.