

పంకజ్ & నిధి ఫ్యాషన్ రంగంలో పెద్ద పేరు ఉన్న దుస్తుల సంస్థ. 2006 లో మొదలైన ఈ సంస్థ అప్పటినుంచి అనేక అవార్డ్స్ ని అలాగే తమ దుస్తులతో చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఈ జంట దుస్తుల్లో చూపించే కొత్తదనం అలాగే స్టైల్ వీరి సంస్థని ముందుకు తీసుకొని వెళ్తోంది. బాలీవుడ్ నటీమణులు జాక్వలిన్, రాధిక ఆప్టే, కియరా అద్వానీ లాంటి వారు వీరి అందమైన దుస్తులతో మెరిసారు. ఇక ఈ మధ్య వీరి దగ్గర్నుంచి కొత్తగా డిజైన్స్ వచ్చాయి. 2020లో రాబోయే పండగలకి అనువుగా సిల్క్ దారంతో లెహంగా సెట్ ని విడుదల చేసారు. ఈ డ్రస్సుని మోడల్ కనిష్ఠ ధన్కర్ ధరించి చాలా అందంగా కనిపించారు. ఫోటోగ్రాఫర్ ఆనంద్ గొగోయ్ ఆమెని అందంగా ఫొటోస్ తీశారు. కనిష్ఠ ని ఇంత స్టైల్ గా ప్రముఖ స్టైలిస్ట్ గోపాలిక తయారు చేశారు. ఆమె అందమైన చెవి రింగ్స్ జ్యువెలరీని ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఔట్ హౌస్ వారు డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కలెక్షన్ ఢిల్లీలో ఉన్న తమ ఫ్లాగ్ షిప్ స్టోర్ లో లభ్యం అవుతుంది అని తమ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు.