
నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ విభిన్నమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అతనొక్కడే, హరేరామ్, ఓం లాంటి వైవిధ్యమైన చిత్రాలతో మంచి విజయాలను సాధించారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన చిత్రాలు అపజయాలుగా మిగిలిపోయాయి. ఈ తరుణంలో ఆయన హిట్ కొట్టడం అనివార్యం అయిపోయింది. తాజాగా ఆయన తదుపరి చిత్రం గురించిన అప్డేట్ వచ్చింది.
In a mythical land lost to history,there lived a barbarian King. This is his tale.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2021
Presenting #Bimbisara https://t.co/XRlLRatHVV
స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ మరియు ఆయన లుక్ రిలీజ్ చేసారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో ఆయనలుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. కళ్యాణ్ రామ్ ఇదివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించనున్నారు. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన బింబిసారుడి కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇలాంటి మైథిలాజికల్ పాత్రలో నటిస్తుండటంతో పాటు, ఆ పాత్ర లుక్, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్స్ తో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. కొవిడ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే షూటింగ్‌ను తిరిగి మొదలుబెడతారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్ తెలియజేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ నాయికలుగా నటిస్తున్నారు.