`కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌`ని డిసెంబ‌ర్ 2 నుంచి ప్రారంభిస్తున్న ఆహా!!

మ‌న‌సు తేలిక‌గా ఉండాల‌న్నా, న‌వ్వి న‌వ్వి క‌డుపు నొప్పి రావాల‌న్నా మంచి కామెడీని ఆస్వాదించాలి. అలాంటి ఆహ్లాద‌క‌రమైన హాస్యాన్ని సంపూర్ణంగా అందించ‌డానికి ముందుకొస్తోంది ఆహా. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ షో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ని, డిసెంబ‌ర్ 2 నుంచి ప్ర‌సారం చేయ‌నుంది. పాపుల‌ర్ క‌మెడియ‌న్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయ‌బోతున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎఫ్‌2: ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌తో ఫిల్మ్ రైట‌ర్‌, స్టార్ డైరక్ట‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన అనిల్‌ రావిపూడి ఈ షో ద్వారా ఓటీటీకి రంగ‌ప్ర‌వేశం చేస్తున్నారు. కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోకి ఆయ‌న ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అనిల్‌రావిపూడి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోని సుడిగాలి సుధీర్‌, దీపిక పిళ్లై హోస్ట్ చేస్తారు. ఈ షోలో సెల‌బ్రిటీ క‌మెడియ‌న్స్ వేణు, ముక్కు అవినాష్‌, స‌ద్దాం, ఎక్స్ ప్రెస్ హ‌రి, భాస్క‌ర్‌, జ్ఞానేశ్వ‌ర్ స్టాక్స్ గా ఉంటారు. ప్రేక్ష‌కుల‌కు చక్క‌టి న‌వ్వుల‌తో గిలిగింత‌లు పెట్ట‌డానికి వారంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ షోలో మూడు రౌండ్స్ ఉంటాయి. స్టాక్ (క‌మెడియ‌న్‌)కి లైవ్ ఆడియ‌న్స్ ఓట్లు వేస్తారు. అక్క‌డ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న‌వారు ఛైర్మ‌న్ మ‌న‌సు గెలుచుకుని టాప్ స్టాక్‌గా పేరు తెచ్చుకుంటారు. 10 ఎపిసోడ్లుగా సాగుతుంది ఈ షో. నిర్విరామంగా వినోదాన్ని పంచుతూ, ప్ర‌తి వీకెండ్‌నీ న‌వ్వుల‌మ‌యం చేయ‌బోతోంది.

కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌తో ఓటీటీలోకి ప్ర‌వేశిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “హాస్యంలోని కోణాల‌ను ఆవిష్క‌రించ‌డానికి ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అనే బ్రాండ్ న్యూ కామెడీ షోని నాకు ఇచ్చినందుకు ఆహా వారికి ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను. ఇప్ప‌టిదాకా నేను చేసిందంతా ఆఫ్‌కెమెరాలోనే. ఇప్పుడు ఆడియ‌న్స్ కి నేను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది.”

Linkhttps://www.youtube.com/watch?v=x_vIpw7J1ig


ఈ షోని హోస్ట్ చేయ‌బోతున్న సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, “ఇన్నేళ్లుగా ప్రేక్ష‌కులు నా ప‌ట్ల చూపిస్తున్న ఆద‌ర‌ణ‌కు, ప్రేమ‌ను ధ‌న్య‌వాదాలు. వాళ్లు నా మీద పెట్టుకున్న న‌మ్మ‌కం ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ప్ర‌తి అడుగూ ముందుకు వేస్తున్నాను. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లోనూ ఈ షో ద్వారా న‌వ్వులు పూయిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. తొలిసారి ఆహాతో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు నా మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఈ షోని చూసి నా ఫ్యాన్స్ ఎంత‌లా ఆస్వాదిస్తారో చూడాల‌ని ఉత్సాహంగా ఉంది.”

ఈ డిసెంబ‌ర్‌లో కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌తో వాతావ‌ర‌ణం న‌వ్వుల‌మ‌యం కానుంది. కొత్త సంవ‌త్స‌రానికి స‌రికొత్తగా చిరున‌వ్వుల‌తో స్వాగ‌తం చెప్పడానికి సిద్ధం కండి.

మీ అంద‌రికీ గిలిగింత‌లు పెట్ట‌డానికి డిసెంబ‌ర్ 2 నుంచి ఆహాలో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ రాబోతుంది! తప్పకుండా వీక్షించండి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.