
ఇప్పుడు తారక్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆనందపడే వర్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అప్డేట్. కరోన కారణంగా స్వీయ నిర్బంధలో ఉన్న ఎన్టీఆర్ ఫోన్ కాల్ ద్వారా ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ప్రతీ విషయాన్ని చాలా క్షుణ్ణంగా వివరించారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ ఎప్పుడు అన్న విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సంధానాలు ఇచ్చారు. “లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాను 17 సంవత్సరాల నుండి 365 రోజులు పని చేయడం అలవాటు అవడం వల్ల ఇంట్లో ఉండటం కొద్దిగా కష్టంగా ఉంది. ఒకరకంగా దీని వల్ల ఇంట్లో పిల్లలతో, ఫ్యామిలితో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పాండమిక్ వల్ల లేట్ అవటంతో పెద్దగా నష్టమేమి జరగలేదు. బడ్జెట్ పరంగా, కథ పరంగా ఎటువంటి మార్పులు జరగలేదు కాకపోతే పని చేసే టైం పెరిగింది అంతే” అని అన్నారు.

ఇక సినిమాని ఓ.టి.టికి రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆర్.ఆర్.ఆర్ ని ఎప్పుడూ ఓ.టి.టి సినిమాగా మేము అనుకోలేదు. కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలి. అవెంజర్స్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలను ఓ.టి.టిల్లో చూస్తే ఎం బాగుంటుంది. ఖచ్చితంగా సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాము. ఆడియెన్స్ తిరిగి థియేటర్లకి వస్తారని మాకు నమ్మకం ఉంది వారి కోసం మేము ఎదురు చూస్తాము” అని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ వార్త ఆయన అభిమానులకు ఊరటనిచ్చే వార్త అనడంలో ఎటువంటి సందేహం లేదు.