
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రధారులుగా వైజయంతి నెట్ వర్క్ పతాకంపై తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు.. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కి అనుదీప్ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కి మంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కి ఈ సినిమా హిట్ మంచి బూస్ట్ లాంటిది అని చెప్పొచ్చు.

ఇక మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే.. విడుదలై మూడు రోజులవుతున్న ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా గొప్పగా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. మేకర్స్ కొన్ని మంచి ప్రమోషన్లు బాగా చేస్తున్నందున, ఈ చిత్రం ఈ రోజు ఒక మిలియన్ మార్కుకు చేరుకోబోతుంది.

సాయంత్రం వచ్చే కలెక్షన్స్ తో వన్ మిలియన్ మార్క్ ను రీచ్ అవుతుంది. కాగా మేకర్స్ ఇప్పటికే భారీ లాభాలలో ఉన్నారు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే అనేక ప్రముఖుల నుంచి నవీన్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నాడు.ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి11న విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది.