
కొత్తరకమైన కథలతో మలయాళం సినిమాలు రోజు రోజుకి దేశం అంతటా పేరు తెచుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఒక మలయాళం సినిమా ఆస్కార్ కి వెళ్ళనుంది. అది లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2019, అక్టోబర్ 4న విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు డైరెక్టర్ లిజో.
ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్ళడంతో ఈ సినిమా పేరు దేశం అంత మారుమోగిపోతుంది. ఈ సినిమా ఆస్కార్ కి పంపించడం చాలా గొప్ప నిర్ణయం అని అందరి అభిప్రాయం. కేరళలో ఎక్కువ తినే దున్నపోతు మాంసం కోసం ఒక దున్నపోతుని చంపుతుంటే అది తప్పించుకొని పారిపోతుంది. అలా పారిపోయిన దున్నపోతుని పట్టుకోడానికి మనుషులు ఎం చేశారు అనేది కథ. ఈ సినిమా తెలుగులోకి ఆహా ఓ.టి.టి వారు డబ్బింగ్ చేశారు. భారీ పోటీ ఉండే ఆస్కార్ అవార్డ్స్ లో ఈ సినిమా అవార్డును పొందాలి అని దేశం అంత కోరుకుంటుంది. ఈ సినిమా మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.
Malayalam film #Jallikattu Directed by Lijo Jose Pellissery is India's official Entry to the #Oscars 2021 in International Feature Film category pic.twitter.com/TZyFJSO5vc
— BARaju (@baraju_SuperHit) November 25, 2020