
క్రియేటివ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. తమిళ, తెలుగు ప్రేక్షకులు అందరు ఎప్పటినుంచో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం ‘జగమే తంతిరం’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన `రకిట రకిట` పాటకు శ్రోతల నుంచి అత్యద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘జగమే తంతిరం’ చిత్రంలో ధనుష్ హీరోగా నటించారు.

ఈ చిత్రంలో తమిళ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ అదరగొట్టారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ‘జగమే తంతిరం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం తెలుగులో జగమే తంత్రం పేరుతో విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే వీలు లేదు కాబట్టి ఓ.టి.టిలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ కార్తీక్ సుబ్బరాజు చేసిన అన్ని చిత్రాలు దేనికవే భిన్నంగా ఉంటాయి.

ఇక ఈ చిత్రాన్ని 190 దేశాల్లో, 17 భాషల్లో విడుదల చేయన్నున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెలియజేసారు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టార్ అయిన సురుళి లండన్ వెళ్ళి అక్కడ ఎం చేసాడు అనేది క్లుప్తంగా కథ. ధనుష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఈ చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ మూవీ గా మన ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ ‘ది గ్రే మ్యాన్’ అనే హాలివుడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల అవుతున్న ‘జగమే తంతిరం’ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.