
బుల్లితెరపై మెరిసి ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీ గా మారిపోయిన యాంకర్, నటి అనసూయ.. జబర్దస్త్ షో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షో తో వచ్చింది.. ఆ షో లో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు.. వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా లో నెగెటివ్ రోల్ అదరగొట్టి తనలోని కొత్త యాంగిల్ ని చూపెట్టింది. రంగమ్మత్త గా ఆమె ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..

ఇప్పటికీ ఆమెను రంగమ్మత్త అని పిలుస్తుంటారు. టీవీ, బిగ్ స్క్రీన్ లలోనే కాదు సోషల్ మీడియా లోనూ అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ విషయాలపైనా కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ వస్తుంది.. అంతేకాదు సరికొత్త ఫోటో లను పెడుతూ తన అభిమానులను ఊరిస్తుంది.. కనిపించి కనపడని అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరి ఇంట్రెస్ట్ తనపై ఉండేలా చేసుకుంటుంది..ఇక ఆమె ఐటెం సాంగ్ కూడా మొదలుపెట్టింది.. కానీ అనసూయ స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలే హిట్ అవడం లేదు. గతంలో సాయి ధరం తేజ్ విన్నర్ లో సుయ సుయ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ కి ఆ సినిమా ఫలితం షాకిచ్చింది.


అనసూయ సాంగ్ కి మంచి మార్కులు పడినా.. సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆ సాంగ్ అంతగా పాపులర్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా చావు కబురు చల్లగా మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. అనసూయ మాస్ స్టెప్స్, సాంగ్ అన్ని సూపర్.. కానీ సినిమా ఫలితమే మళ్ళీ తేడా కొట్టింది. క్రిటిక్స్ నుండి పూర్ రేటింగ్స్, ప్రేక్షకుల స్పందన సో సో గా ఉండడంతో చావు కబురు చల్లగా రొటీన్ లిస్ట్ లో చేరిపోయింది. సినిమాలో అనసూయ సాంగ్ గురించి ప్రేక్షకులు, క్రిటిక్స్ స్పెషల్ గా మట్లాడుకున్నా అనసూయ కి ఏం ఉపయోగం ఉంది.. సినిమా ఫలితం తేడా కొట్టాక. మరి అనసూయకి ఆ లెక్కన స్పెషల్ సాంగ్స్ అచ్చిరావనే ఫిక్స్ అయిపోవచ్చేమో.