బాబోయ్ పవన్ ఫాన్స్ లో ఇంత కసి ఉందా..మాములు ఫ్యాన్స్ కాదుకదా..!!

తెలుగులో ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి.. వాటిలో ట్రైలర్ లు యూట్యూబ్ లో కూడా రిలీజ్ అయ్యాయి.. అయితే ఏ సినిమా కి ఆ సినిమా గత సినిమా తాలూకు రికార్డును బద్దలు కొడుతుండడం విశేషం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ ఇప్పుడు ఈ ఘనత సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో హుషారు రెట్టింపు అవుతుంది. పవన్ పై తమకున్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు..

పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా కెమెరా ముందుకి వచ్చి కనపడనేలేదు ఫ్యాన్స్ మాత్రం అన్నీ తామై సినిమా ని ముందుండి నడిపిస్తున్నారు.. ఇప్పటికే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ షో లలో పాల్గొంటున్నారు.. త్వరలో జరిగే ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ సినిమా రిలీజ్ కి ముందే ఓ రేంజ్ కి వెళ్లిందని చెప్పొచ్చు.. ఈ సినిమా ట్రైలర్ ఒక్క రోజు వ్యవధిలో 15 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్.. మిలియన్‌కు పైగా లైక్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందున్న ఆల్ టైమ్ రికార్డులన్నింటినీ భారీ తేడాతో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ బద్దలు కొట్టేసింది.  ఏదో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన భారీ సినిమా ట్రైలర్‌కు ఇలాంటి వ్యూస్, లైక్స్ వచ్చాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ వకీల్ సాబ్ లాంటి రీమేక్ మూవీ ఇలాంటి రికార్డులు అసాధారణం.

ఇక బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కి దిల్ రాజు, బోణీ కపూర్ లు నిర్మాతలు.. ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు.. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ ఆదివారం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత  దాదాపు మూడేళ్ళ తర్వాత రాబోతుండడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.