లవర్ బాయ్ తరుణ్ ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నాడా..?

టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటుడిగా, హీరోగా అయన తనదైన ముద్ర ను వేశారు.. అయితే తన ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పటడుగులు, వేసి హీరోగా కనుమరుగైపోయారు.. బాలనటుడిగా పలు సినిమాలు చేసిన తరుణ్ అక్కడ ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేసుకున్నాడు.. ఎవరీ కుర్రాడు ఇంత చలాకీ గా ఉన్నాడు అనిపించుకునేలా నటించి అప్పట్లో బాలనటులు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు..

ఇక ఆ ఇమేజ్ తో టీనేజ్ లోకి వచ్చాక హీరో అయిపోయాడు తరుణ్.. తొలి సినిమా నువ్వేకావాలి తో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది.. దాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న తరుణ్ లవర్ బాయ్ తరుణ్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఎన్ని హిట్ చిత్రాల్లో నటించాడు..  ప్రియమైననీకు, నువ్వే నువ్వే ,నువ్వులేక నేనులేను, పున్నగై దేశం, అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను ,ఎలా చెప్పను, సోగ్గాడు, నీమనసు నాకు తెలుసు వంటి చిత్రాలు చేసి స్టార్ హీరో కి ఒక్కడుగు దూరంలో ఉండిపోయాడు.

అయితే ఆ తర్వాత కానీ తరుణ్ కి దురదృష్టం వెంటాడలేదు. అయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.. నవవసంతం, భలే దొంగలు సినిమా ఫ్లాప్ కావడం అప్పుడే కొత్త హీరోలు వచ్చి హిట్ లు కొట్టడంతో తరుణ్ ని పట్టించుకోలేదు దర్శక నిర్మాతలు.. మధ్య లో ఒక సినిమా చేసిన అది దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది.. దాంతో సినిమాలకు దూరం గా ఉన్నాడు.. అయితే తాజాగా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తరుణ్.. తన స్నేహితుడు చెప్పిన ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ నచ్చడంతో తరుణ్ ఓకే చెప్పాడట.ఈ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలెక్కించి మళ్ళీ పూస్తవైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడట. మరీ ఈ సినిమా అయిన తరుణ్ కి మంచి కం బ్యాక్ సినిమా అవుతుందా అనేది చూడాలి..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.