శర్వానంద్ 30 కి ఆసక్తికర టైటిల్..!!

మహాసముద్రం సినిమా చేస్తున్న శర్వానంద్ తన తదుపరి సినిమా టైటిల్ ని నేడు ప్రకటించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాసముద్రం చివరిదశ చిత్రీకరణ లో ఉండగా అయన తదుపరి చిత్రం అనౌన్స్ చేశాడు.ఆ సినిమా పేరే 'ఒకే ఒక జీవితం'.

కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పల్లెకీ .. పట్టణానికి మధ్య హీరో జీవితం ఎలా సాగింది? ఆయనకి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరగనున్నట్టుగా తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అమల అక్కినేని ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.   ఇకపోతే శర్వానంద్ గత కొన్ని రోజులుగా వరుస ప్లాప్ లనే అందుకుంటూ వస్తున్నాడు. ఈనేపథ్యంలో అయన మహాసముద్రం సినిమా పై నే భారీ ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.