వీరమల్లు పై ఆసక్తి రోజు రోజు కి పెరుగుతుందిగా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో సూపర్ హిట్ కొట్టిఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ నేపథ్యంలో ఆయన నటించే తదుపరి చిత్రాలు బాగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు..  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లోని పింక్ సినిమా ఆధారంగా పూర్తిగా తెలుగు నేటివిటీ తో తెరకెక్కింది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కి కాసుల వర్షం కురిసింది..

అయితే కరోనా నేపథ్యంలో థియేటర్లు మూసివేయడంతో ఈ సినిమా ని OTT లలో రిలీజ్ చేశారు.. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.. ఇక పవన్ నటించే ఆసక్తికరమైన చిత్రాలలో ఒకటి క్రిష్ దర్శకత్వంలోని హరిహర వీరమల్లు సినిమా.. మొఘల్ చక్రవర్తుల కాలంనాటి కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ కాలంనాటి వాతావరణానికి అద్దం పడుతూ భారీ సెట్లు వేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు, త్వరలో మళ్లీ మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు. అందువల్లనే పవన్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు.

ఈ సినిమాలో 'వీరమల్లు' అనే వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దీంతో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అయితే కథాపరంగా ఆయన మరో రెండు డిఫరెంట్ లుక్స్ లో కూడా కనిపించనున్నాడనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. తనని అన్వేషిస్తున్న సైనికుల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన గెటప్స్ మారుస్తాడా? లేదంటే అలాంటి సందర్భం మరేదైనా ఉందా? అనేది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.