ఇది చిన్న ‘సినిమా’లకు దారి చూపే ‘బండి’

ప్రస్తుతం ఇండిపెండెంట్ సినిమాలు పెరిగిపోతున్నాయి. మలయాళ, తమిళ పరిశ్రమల నుండి ఇండీ-ఫిల్మ్ మేకర్స్ ఎందరో తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. వారి పోలిస్తే మన తెలుగు పరిశ్రమలో ఇండిపెండెంట్ సినిమాలు తక్కువే అయనప్పటికీ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోలు ఉండాలి భారి బడ్జెట్ ఉండాలి అనే గీతలను ఇండీ-ఫిల్మ్ మేకర్స్ చెరిపేస్తున్నారు. ఇక ఇటీవలే తెలుగులో వచ్చిన మరో ఇండీ మూవీ ‘సినిమా బండి’. ఫ్యామిలి మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ తో దేశం మొత్తాన్ని తమ వైపుకి తిప్పుకున్న దర్శక ద్వయం రాజ్-డి.కె లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ప్రధానంగా వీర అనే ఆటో డ్రైవర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పొట్ట గడిస్తే చాలు అనుకునే అతనికి ఒక కెమెరా దొరుకుతుంది. దాన్ని చూసిన వీరకి సినిమా తీయాలని కోరిక పుడుతుంది. లో-బడ్జెట్ ఫిలిమ్స్ మంచి హిట్స్ అవుతున్నాయి అని టి.వి లో చూసిన అతను సినిమా తీస్తే తను కూడా స్టార్ అవొచ్చు అనే భావనలో ఊరిలో అందరినీ సినిమా తీయడానికి ఒప్పిస్తాడు. అలా సినిమా సరదాగా మొదలైన సినిమా డ్రామాగా మారి మనకి తెలియకుండానే మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

సాధారణ కామెడి సినిమాలాగే అనిపించినప్పటికీ మనసుని హత్తుకునే సన్నివేశాలతో మనల్ని కంటతడి పెట్టిస్తుంది ఈ సినిమా. కమర్షియల్ సినిమాల్లో ఉండే ఫిమేల్ క్యారెక్టర్స్ కంటే ఎంతో గొప్పవైన ఫిమేల్ క్యారెక్టర్స్ ని రాసుకున్నాడు దర్శకుడు. వీర తన పని వదిలేసి సినిమా తీయలనుకుంటున్నా అని తన భార్యకు చెప్పినప్పుడు ఆమె ఇంటి భాత్యలను స్వీకరిస్తుంది. అమెచ్యూర్ ఫిల్మ్ మేకింగ్ ని డ్రామాటైజ్ చేసి సినిమా తీసేటప్పుడు ఉండే బాధల్ని, ఆనందాల్ని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల అద్భుతంగా తెరకెక్కించాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.