We’re so excited to announce this SUPER AMAZE collaboration with @SouthBayLive and the very talented @RanaDaggubati 😭✨
— India Wants To Know - Panel Quiz Show (@IWTKQuiz) November 28, 2020
Go rewatch our season 1 and stay tuned for some amazing surprises from us! #IndiaWantstoKnow #IWTKxSouthBayLive #YASS https://t.co/M9Xc03QMsP
ఈ మధ్యనే రానా దగ్గుబాటి యూట్యూబ్ లో మొదలుపెట్టిన సౌత్ బే ఛానల్ లో సౌత్ సెలెబ్రెటీస్ తో క్రేజీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ ఛానల్ లో రానా తో పాటు లక్ష్మీ మంచు కూడా ఇంటర్వ్యూలు చేస్తుంది. ఇక ఈ ఛానెల్ లో ఇప్పుడు కొత్త క్విజ్ షో రాబోతుంది. ‘ఇండియా వాంట్స్ టు నో’ అనే కొత్త రకం ప్యానెల్ క్విజ్ షో ని ఈ యూట్యూబ్ ఛానెల్ లో మొదలుపెడుతున్నారు. ఈ ‘ఇండియా వాంట్స్ టూ నో’ షో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ఉండగా దాన్ని ఇప్పుడు రానా సౌత్ బే ఛానల్ తో కలుపుతున్నారు. ఇండియా వాంట్స్ టూ నో షో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే ఈ షో సీసన్-1 పూర్తి చేసుకుంది. త్వరలోనే సౌత్ బే ఛానల్ లో ఈ షో రాబోతుంది. రానా దగ్గుబాటి ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రానా దగ్గుబాటి చేసిన రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. మాములుగా జరిగే ఇంటర్వ్యూలకన్న ఇవి కొత్త రకంగా ఉండటంతో జనాలు ఈ వీడియోస్ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.