
విశ్వక్ సేన్ హీరోగా నటించిన పాగల్ సినిమా ఆగస్టు 14 న విడుడలా కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఎవరికి పడితే వాళ్లకి ఐ లవ్ యు చెబుతూ ఉంటాడు. అలాటి హీరో ఒక యువతిని మాత్రం నిజంగానే లవ్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అమ్మాయి 'నో' చెబుతుంది. ఆ తర్వాత ఆమె ప్రేమను పొందడానికి అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

లవ్ .. కామెడీతో పాటు ఈ సినిమాలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు యూత్ ను .. అటు మాస్ ను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ కథను తయారు చేసినట్టుగా తెలుస్తోంది.